కాంగ్రెస్ కుట్రలను చట్టపరంగానే ఎదుర్కొంటాం!

9
- Advertisement -

కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను చట్టపరంగానే ఎదుర్కొంటామని తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్. రాహుల్ గాంధీ కరెన్సీ మేనేజర్ (CM) తెలంగాణలో కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించారు…అదే సీబీఐని రాహుల్‌ గాంధీ ఒకప్పుడు బీజేపీకి చెందిన “ప్రతిపక్ష నిర్మూలన సెల్” అని పిలిచారు.

కానీ ఇప్పుడు మీ సీఎం చేస్తున్న పనుల గురించి మీకేనా అవగాహన ఉందా అని రాహుల్‌ను ప్రశ్నించారు కేటీఆర్. కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏ కుట్ర చేసినా — మేము చట్టపరంగానూ, రాజకీయంగానూ పోరాడతాం. న్యాయవ్యవస్థపై, ప్రజలపై మాకు నమ్మకం ఉంది…సత్యమేవ జయతే అని ట్వీట్ చేశారు కేటీఆర్.

 

Also Read:మైసూరు తరహాలో దసరా వేడుకలు!

- Advertisement -