కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నానని కేటీఆర్ చెప్పారు. ఇటువంటి కామెంట్లు చేసిన రేవంత్ రెడ్డి ముస్లింలను అవమానించారని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక విడుదల చేసిన కేటీఆర్.. ముస్లిం సమాజానికి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే కాంగ్రెస్‌కు ఎలా సమాధానం చెప్పాలో ప్రజలు నిర్ణయించుకుంటారని అన్నారు.
కాంగ్రెస్ పుట్టకముందు నుంచీ ముస్లింలు ఉన్నారని, సీఎం రేవంత్ తన అజ్ఞానం నుంచి బయటకు రావాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ లేకపోయినా హిందువులు ఉంటారని, కాంగ్రెస్ లేకపోయినా ముస్లింలు ఉంటారని చెప్పారు. రేవంత్ రెడ్డి ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్‌లో, నిరాశలో మాట్లాడుతున్నాడు..రేవంత్ రెడ్డి కంటే గట్టిగా మేము మాట్లాడొచ్చు కానీ మా నాయకుడు కేసీఆర్ నూచనలు పాటిస్తున్నాం అన్నారు.
రేవంత్ రెడ్డి నన్ను వ్యక్తిగతంగా తిట్టినా, నేను ఆయనకు గౌరవం ఇచ్చే మాట్లాడుతా…హైదరాబాద్ అభివృద్ధికి 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో, గత రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చర్చకు రేవంత్ రెడ్డి సిద్ధమా? చెప్పాలన్నారు. అసదుద్దీన్ ఓవైసీ, రేవంత్ రెడ్డిని RSS అన్న అని అన్నాడు.. ఈ రెండేళ్లలో ఏం నచ్చిందో ఆయనతో కలిసి పని చేస్తున్నాడు…కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ బీహార్ లో ఎంఐఎం పార్టీ బీజేపీకి బీ-టీం అని అంటున్నాడు.. జూబ్లీహిల్స్ లో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తుంది… ఈ కాంగ్రెస్ నేతలు అసదుద్దీన్ ఓవైసీ పరువు తీస్తున్నా ఆయన వాళ్ళతోనే ఎందుకు కలిసి తిరుగుతున్నాడో తెలియడం లేదు అన్నారు.
హైదరాబాద్‌లో చెత్త సమస్య పరిష్కారం కోసం నగరాన్ని 400 భాగాలుగా విభజించి, ఒక్కో యూనిట్ కి ఒక్క ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమించి స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం… ఈ కార్యక్రమం కోసం వేల సంఖ్యలో స్వచ్ఛ ఆటోలను ప్రవేశ పెట్టాం అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో ఒక్కటంటే ఒక్క కొత్త స్వచ్ఛ ఆటో అయినా ఇచ్చారా? చెప్పాలన్నారు కేటీఆర్.

