బీజేపీకి రాజ్యాంగంపై గౌరవం లేదు:కేటీఆర్

5
- Advertisement -

బీజేపీపై రాజ్యాంగంపై ఏ మాత్రం గౌరవం లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్… పహల్గాం మారణకాండకు కారణమైన పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడటం బీజేపీ కపట దేశభక్తికి నిదర్శనమని తెలిపారు.

పాక్‌ ప్రేరేపిత ఉగ్రదాడిలో మరణించిన 26 మంది అమాయకుల నెత్తురు తడి ఇంకా ఆరకముందే ఆ దేశంతో క్రికెట్ ఆడేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోవడం ఆ పార్టీ నకిలీ జాతీయవాదం, కపట దేశభక్తికి తిరుగులేని సాక్ష్యం అన్నారు. . బీజేపీది నకిలీ జాతీయవాదమని, తమది ఆచరణలో, ఆత్మలో నిజమైన జాతీయవాదమని స్పష్టంచేశారు.

కులం, మతం, వర్గం చూడకుండా ప్రతి భారతీయుడిని సమానంగా ఆదరించడమే తమ దృష్టిలో నిజమైన జాతీయవాదం అన్నారు. జాతీయవాదానికి, దురహంకార దేశభక్తికి మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడమే అసలైన దేశభక్తి అని చెప్పారు. పహల్గాం బాధిత కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకించినా ఏ మాత్రం పట్టించుకోకుండా కోట్లాది భారతీయులను మోదీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా ఆరోపించారు.

Also Read:ప్ర‌భాస్-ప్ర‌శాంత్ వ‌ర్మ‌..గేమ్ ఆన్!

- Advertisement -