KTR: హైడ్రా పేరుతో విధ్వంసం

0
- Advertisement -

సంవత్సర కాలం పాటు ప్రతికూల రాజకీయ పరిస్థితులు ఉన్న ఒక్క సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోగలిగామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన కేటీఆర్..మా పార్టీ శ్రేణుల్లో నాయకుల్లో ఉత్సాహం నెలకొందన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేమని, ముఖ్యంగా రుణమాఫీ రైతు భరోసాను ప్రజలకు ఇవ్వలేకపోయమని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి అన్నారు.

రాష్ట్ర ప్రజలను మోసగించే కుట్రలతోనే నూతన సంవత్సరాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించబోతుంది… కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయద్దు నిరూపించిందన్నారు. ఒకవైపు రైతు భరోసాను ఎత్తకొట్టడం.. బీసీలను మోసపుచ్చడం అనే రెండు ప్రయత్నాలతో నూతన సంవత్సరాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించబోతుందని…కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరాని ధోకా నామ సంవత్సరంగా చెప్పుకుంటే బాగుంటుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీలు… గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీకి శాపాలై చుట్టుకున్నాయి, రైతు భరోసా ఎగకొట్టి రైతుల నోట్లో మట్టికొట్టింది ప్రభుత్వం అన్నారు. 26 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా ఎగగొట్టడం వలన భాకీ పడింది…ఎవరికి రైతు భరోసా ఇస్తారు అని విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదు అన్నారు. ఎవరు పంట వేస్తున్నారు ఎవరు గుర్తుపట్టి రికార్డులకెక్కిస్తారు… అంత యంత్రంగా ప్రభుత్వానికి ఉన్నదా… 72,000 కోట్లు సాఫీగా రైతుల ఖాతాలోకి పోయిన కార్యక్రమాన్ని గందరగోళంగా మారుస్తున్నది… అంతిమంగా ఈ వ్యవహారం అవినీతికి దారి తీస్తుంది..ఓకే కాలం పంట వేసే రైతులకు, దీర్ఘకాలిక పంటలు వేసే రైతులకు పోడు భూములు సాగు చేసుకునే గిరిజనులకు రైతు భరోసా ఎగబట్టి కుట్రను ప్రభుత్వం చేస్తుందన్నారు.

బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ను అమలు చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పోతుంది…కోర్టు కేసులపేరు చెప్పి బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషను ఆపే ప్రయత్నం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ప్రజాఉద్యమాల ద్వారా ఎండగడతాం…కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని గ్యారంటీని అమలు అయ్యేదాకా వెంటపడతాం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీని నిలదీస్తాం…స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి నివాళి కోసం సంతాపం కోసం ఏర్పాటుచేసిన తీర్మానాన్ని సమర్థించాము అన్నారు.

అదేవిధంగా తెలంగాణ బిడ్డ ప్రధాని గారికి పి వి గారికి స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాం, వెంటనే ఈ అంశంలో అధికారిక తీర్మానం చేసి మెమోరియల్ కట్టాలి అన్నారు. ఢిల్లీలో పివి గారికి స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని భారతరత్న ఇవ్వాలని గతంలో భారత రాష్ట్ర సమితి తీర్మానం చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది..రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడతాం వెంటపడతాం అన్నారు. డిస్టక్షన్ డిస్ట్రక్షన్ డైవర్షన్ Distraction, Distraction, Diversion (3D) ఇదే త్రీడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం …హైడ్రా పేరుతో విధ్వంసం… అటెన్షన్ డైవర్షన్ ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ విధానం అన్నారు. మా ప్రభుత్వానికి నీళ్లు నిధులు నియామకాలు అని నినాదం ఉంటే ఈ ప్రభుత్వానికి ఈ త్రీ డి ఫార్ములా ఉందన్నారు.

ఈ త్రీడీ ఫార్ములాని అమలు చేస్తుంది కేడి ముఖ్యమంత్రి…ప్రభుత్వ వైఫల్యాలను ప్రభుత్వం మోసాలను ప్రభుత్వ లూటీని ప్రజలకు అర్థమయ్యేలా తెలియ చెపుతాం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల కోసం కాకుండా అల్లుడి కోసం అన్నదమ్ముల కోసం బావమరిది కోసం పనిచేసేది అన్నారు.ప్రజల పైన సోషల్ మీడియా కార్యకర్తల పైన ప్రతిపక్ష నాయకుల పైన అక్రమంగా కేసులు పెట్టడానికే ఈ ప్రభుత్వం సంవత్సర కాలాన్ని గడిపింది…కాంగ్రెస్ పార్టీ అవినీతిని అరాచకాలను ఢిల్లీ సాక్షిగా ఎండగట్టాం…అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం సివిల్ సప్లై కుంభకోణం అమృత్ టెండర్ల కుంభకోణం మంత్రులపై పొంగులేటి పై జరిగిన ఈడి దాడి వంటి అంశాల నుంచి బిజెపి ప్రభుత్వం ఒక రక్షణ కాపాడుతుందన్నారు. కచ్చితంగా బిజెపి పార్టీ బిజెపి పార్లమెంటు సభ్యులు, బిజెపి కేంద్ర మంత్రులు రేవంత్ రెడ్డికి రక్షణ గోడలెక్క నిలబడ్డారు ..మేము లేవనెత్తిగా సివిల్ సప్లైస్, అమృత్ కుంభకోణాలపై కేంద్రం ఎందుకు స్పందించలేదు అన్నారు. పొంగులేటి ఇంటి పైన జరిగిన ఈడి దాడుల పైన ఎందుకు స్పందించలేదనే రాష్ట్ర ప్రజలకు తెలియచెప్పాలి…రాష్ట్ర ప్రభుత్వ అవినీతి కార్యక్రమాల్లో బిజెపి పార్థ పరోక్షంగా ఉన్నదని అర్థమవుతుండదు అన్నారు.

Also Read:పసలేని పనికిమాలిన కేసులు: కేటీఆర్

- Advertisement -