సీఎం రేవంత్ రెడ్డి ఏం చేసినా ఓ లెక్క ఉంటదని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్…280 ఎకరాలను తన అనుమాయులకు కట్టేందుకు కసరత్తు చేస్తున్నారన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును రీపేర్ చేస్తామన్న ఎల్ అండ్ టీ సంస్థపై పగ పెంచుకున్నారన్నారు. రేవంత్ రెడ్డి అహంకారం కోసం ప్రజలపై భారాలు వేస్తారన్నారు. ఓఆర్ఆర్ ను లీజ్‌కు ఇచ్చామని అమ్మలేదన్నారు.
ప్రతీ రోజు 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారన్నారు. ఎల్ అండ్ టీ సంస్థనే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌ను కట్టిందన్నారు. ఎల్ అండ్ మెట్రోకు ధైర్యం చెప్పి మెట్రోనే త్వరితగతిన పూర్తి చేశౄమన్నారు. తెలంగాణ రైజింగ్ అంటే ఎల్ అండ్ టీకి మెట్రోకు రద్దు చేయడమేనా చెప్పాలన్నారు.
ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీకి మెట్రో కావాలి..రహేజా ఐటీ పార్క్ ట్రాఫిక్ సమస్యను తగ్గించే సోయి లేదా చెప్పాలన్నారు.ప్రజా రవాణపై సీఎంకు ఏ మాత్రం అవగాహన లేదన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఓపెన్ దాదాగిరి చేస్తున్నారన్నారు. పండగలు వస్తే ఆర్టీసీ ఛార్జీలు డబుల్ చేయడమే తోఫా అన్నారు. ముఖ్యమంత్రి అహంకారపూరిత నిర్ణయం వల్లే ఎల్ అండ్ టీ సంస్థ నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చే రూ15వేల కోట్లు ఎవరు కడతారో చెప్పాలన్నారు. పీపీపీలో ఉన్న దానిని ప్రభుత్వం తీసుకుంటున్నట్లు కేంద్రానికి చెప్పారా అని ప్రశ్నించారు.
Also Read:రూ.100 కోట్ల సినిమా ఓటీటీలోకి!

