వార్డు మెంబర్‌ కాని వ్యక్తికి కలెక్టర్ సలాం కొట్టొచ్చా!

14
- Advertisement -

వార్డు మెంబర్ కూడా కాని రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కలెక్టర్ సలాం కొట్టొచ్చు.. కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు చేస్తే సరూర్ నగర్ పాఠశాల హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. సిగ్గు సిగ్గు అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.

తిరుపతి రెడ్డికి పోలీసులు ఎస్కార్ట్ ఇవ్వొచ్చు.. ఆయన కళ్యాణలక్ష్మి చెక్కులు పంచొచ్చు , అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయొచ్చు అన్నారు.ఆయనకు పాఠశాల విద్యార్థులను నడిఎండలో నిలబెట్టి పూలుచల్లి స్వాగతం పలకొచ్చు.. వారితో ఆయనకు అధికార యంత్రాంగం దగ్గరుండి సెల్యూట్ కొట్టించవచ్చు అన్నారు.

ఏ అర్హత లేకున్నా అధికారిక వేదికపై కలెక్టర్ ను వెనక్కు నెట్టి వేదికను పంచుకోవచ్చు.. పొంగులేటి పుట్టినరోజున విద్యార్థులను ఎండలో నిలబెట్టి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు అన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారి సతీమణికి ఎస్కార్ట్ సదుపాయం కల్పించవచ్చు… కానీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, 14 ఏండ్లు అహింసాయుత పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, అస్థిత్వాన్ని చాటిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున విద్యార్థులకు మిఠాయిలు పంచితే తప్పా ? చెప్పాలన్నారు.

 

Also Read:సీఈసీ నియామకంపై రాహుల్ లేఖ

- Advertisement -