గిఫ్ట్ ఏ స్మైల్..ఆనందాన్నిచ్చింది:కేటీఆర్

7
- Advertisement -

గత ఐదు పుట్టినరోజులు వ్యక్తిగతంగా అత్యంత సంతృప్తినిచ్చాయని తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్. ఇందుకు కారణం#GiftASmile కార్యక్రమం అన్నారు. 2020 సంవత్సరం ప్రపంచమంతా ఎంతో కష్టమైన సంవత్సరం. ఆరోగ్య రంగానికి ఎక్కువ ప్రాధాన్యత అవసరమయ్యింది. అందుకే ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కింద, నా మద్దతుదారుల సహకారంతో మన రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు మొత్తం 108 అంబులెన్సులు అందించగలిగాం అన్నారు.

2021లో, 1400కిపైగా ప్రత్యేకంగా తయారు చేసిన త్రిచక్ర వాహనాలు భౌతికంగా వెనుకబడిన సోదరులు, సోదరీమణులకు అందించాం అని తెలిపారు. 2022లో మన దృష్టి విద్యపై పెట్టాం. సిరిసిల్ల జిల్లాలో 6000 సామ్‌సంగ్ ట్యాబ్‌లను విద్యార్థులకు అందించగలిగాం. ఫలితంగా NEET/JEE సహా ఇతర పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం అన్నారు.

2023 సంవత్సరం కూడా విద్యపై దృష్టి సారించాం. యూసుఫ్‌గూడలోని స్టేట్ హోం నుండి 116 మంది ప్రతిభావంతులైన పిల్లలకు అధిక సామర్థ్యం గల i5 డెల్ ల్యాప్‌టాప్‌లు అందించాం. వారి శిక్షణ, కోచింగ్‌కు కావలసిన అన్ని విధాలుగా మద్దతు ఇచ్చాం అన్నారు. 2024లో సిరిసిల్ల జిల్లాలో నేస్తాల ఆత్మహత్యలు కలవరపరిచాయి. ఆ బాధిత కుటుంబాల పట్ల మా బాధ్యతగా గత ఏడాది నిండు గా వారికి అంకితం చేశాం అన్నారు.

ఈ సంవత్సరం నేను ప్రగతిని, ఆశను, జీవితాన్ని దృష్టిలో ఉంచుకోవాలని అనుకుంటున్నాను. గత 18 నెలలలో సిరిసిల్ల జిల్లాలో 4910 ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీలు జరిగాయి.కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకం జీవనోపాధి మార్పు తీసుకువచ్చింది. కానీ నేను ఒకటి ఎంపిక చేయాలని వస్తే – అది కేసీఆర్ కిట్.జీవితం కంటే గొప్ప మార్పు ఇంకేముంటుంది? అన్నారు.

Also Read:బీజేపీలో ‘కొండా’ కలకలం!

అందుకే ఈసారి ఆ 4910 తల్లులు మరియు పసిపిల్లలందరికీ కేసీఆర్ కిట్స్ అందించాలని నిర్ణయించుకున్నాం..ఒకప్పుడు పుట్టినరోజులకు పుష్పగుచ్ఛాలు తీసుకోకుండా ఉండాలన్న చిన్న ఆలోచనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం, ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎదురుచూసే ఒక పవిత్ర కార్యక్రమంగా మారిపోయింది,“గిఫ్ట్ ఏ స్మైల్” లో భాగమై ఉండే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పారు.

- Advertisement -