రేవంత్ రెడ్డి బైగన్ కే బాతే హైదరాబాద్ ప్రజలు వినలేదు.. అందుకే హైదరాబాద్‌లో అన్ని సీట్లు బీఆర్ఎస్‌కి ఇచ్చారు అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ బైగన్ గాళ్ళ బైగన్ కే బాతే ఊర్లలో ప్రజలు నమ్మి ఓటేసి, ఇప్పుడు మోసపోయామని తిడుతున్నారు అన్నారు.
GHMC ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రవేశపెట్టిన ఫ్రీ వాటర్ స్కీం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎత్తేస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే మాకు ఒక్క సీటు ఇవ్వలేదని కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్ మీద పగపట్టారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేడు, ఒక్క ముస్లిం ఎమ్మెల్సీ లేడు అన్నారు.
అజారుద్దీన్‌ను జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నిలబడనీయకుండా ఒక పేపర్ మీద ఎమ్మెల్సీ అని రాసి బకరాను చేశాడు… అజారుద్దీన్‌కు ఇచ్చిన ఎమ్మెల్సీ పోస్ట్ కోర్టులో నిలబడదు.. ఈ విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు అన్నారు. షేక్‌పేట్‌లో ముస్లింలకు శ్మశాన వాటిక స్థలం అని ఇచ్చాడు.. అది ఆర్మీ వాళ్లు వచ్చి మాది అని గుంజుకున్నారు అన్నారు.
బీసీలకు 42% రిజర్వేషన్లు అని అన్నాడు, అది కోర్టులో నిలబడలేదు.. రేవంత్ రెడ్డికి అన్ని తెలిసినా ప్రజలను మోసం చేయడానికి అవ్వని పనులు చేస్తున్నాడు – కేటీఆర్ ఎన్నికల తర్వాత మీ ఇండ్లకు కారు రావాల్నా? బుల్డోజర్ రావాల్నా? మీ చేతుల్లోనే ఉంది అన్నారు. మీ ఇంటికి కారు రావాలంటే మాగంటి సునీత గెలవాలి, కాదు మా ఇండ్లు కూల్చేందుకు బుల్డోజర్లకు మేమే లైసెన్స్ ఇస్తాం అంటే కాంగ్రెస్ గెలవాలి… రాష్ట్ర ప్రజలంతా జూబ్లీహిల్స్ ప్రజలు మోసకారి కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారని మీ వైపే చూస్తున్నారు అన్నారు.
Also Read:‘కారు’ కావాలా..’బుల్డోజర్’ కావలా: కేటీఆర్

