KTR:ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా!

2
- Advertisement -

ఫోర్త్ సిటీ, స్కిల్ సిటీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొడంగల్ లో ప్రజల తిరుగుబాటు, పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అంశం, రాష్ట్రంలో భూసేకరణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న దురాగతాలపై తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు కేటీఆర్.

ఫార్మా స్యూటికల్స్, లైఫ్ సైన్సెన్స్ రంగంలో మన హైదరాబాద్ లో ఐడీపీఎల్ ను అప్పటి ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి అన్నారు. ఐడీపీఎల్ సంస్థ ఎంతో మందికి గొప్ప వాళ్లను తయారు చేసింది. రెడ్డి ల్యాబ్ ఓనర్ సహా చాలా మంది ఐడీపీఎల్ నుంచి వచ్చారు…40 శాతం భారత దేశంలో బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి హైదరాబాద్ లోనే జరుగుతుందని గర్వంగా చెబుతున్నా అన్నారు.

కరోనా సమయంలో పారాసిటామల్ టాబ్లెట్స్ కావాలని అమెరికా అధ్యక్షుడు కూడా అడిగారు..హైదరాబాద్ ఫార్మా స్యూటికల్ రంగంలో లీడర్ గా తయారైంది. దాన్ని మరింత పెంచాలని కేసీఆర్ నిర్ణయించారు అన్నారు. అదే విధంగా తెలంగాణను ఫార్మా రంగంలో రారాజు చేసేందుకు కేసీఆర్ గారు ఎంతో ముందుచూపుతో ఫార్మాసిటీ ప్లాన్ చేశారు అన్నారు.

తెలంగాణ ఏర్పడిన వెంటనే మనం పంచాయితీలు పెట్టుకోకుండా తెలంగాణలో పెట్టుబడులను ఆహ్వానించాలని కేసీఆర్ మాకు చెప్పారు.తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే చైనా లో జరిగిన వరల్డ్ ఎకానమీ ఫోరమ్ సమావేశానికి కేసీఆర్ వెళ్లారు అన్నారు. చైనా ప్రపంచానికి తయారీ రంగంలో లీడర్ ఎట్ల అయిందని కేసీఆర్ రెండు రోజులు అక్కడే ఉండి పరిశీలించారు అన్నారు. ఒకే చోట 70 వేల ఎకరాల తయారీ రంగం ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి ఎందుకు అక్కడ ఆ విధంగా ఏర్పాటు చేశారో తెలుసుకున్నారు అన్నారు.

Also Read:KTR: ఎమర్జెన్సీని తలపిస్తున్న రేవంత్ పాలన?

స్కేల్ ఆఫ్ ఎకానమీ ఉండే విధంగా అన్ని సంస్థలు ఒకే దగ్గర ఉండే విధంగా చేస్తే ప్రయోజనం ఉంటుందని చైనా వాళ్లు కేసీఆర్ కి చెప్పారు. ..దీంతో హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఫార్మా పారిశ్రామిక వేత్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. వాళ్లు కూడా ఒకే చోట ఫార్మా కంపెనీలు పెట్టాలని కోరారు అన్నారు. ముచ్చర్లలో ఫార్మా పార్క్ పెట్టి అక్కడ నివాసాలు రాకుండా, 50 ఏళ్ల పాటు ఎలాంటి సమస్య లేకుండా ఫార్మా సిటీని డిజైన్ చేశారు అన్నారు. దాదాపు 8 ఏళ్లు కష్టపడి దాదాపు 14 వేల ఎకరాలను మేము సేకరించాం అన్నారు. ప్రశ్నించే గొంతుక అనే కదా నువ్వు కూడా గెలిచింది. మరీ ఇప్పుడు ఎందుకు ప్రశ్నించే వాళ్లను అరెస్ట్ చేస్తున్నారు అని ప్రశ్నించారు.

రైతులు తమ భూములు కాపాడాలని కోరుతూ అందరినీ కలిశారు. ముఖ్యమంత్రి బిజీ గా ఉండటంతో ఆయన సోదరుడిని కూడా కలిశారు అన్నారు. నీ ఆనాలోచిత విధానాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా?, సురేష్ నాతో వచ్చి కలవటమే తప్పు అయితే రాహుల్ గాంధీ వ్యతిరేకించే అదానీతో రేవంత్ రెడ్డి రాసుకొని పూసుకొని తిరుగుతున్నాడు. మరి దానికి రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి తొలగించాలి కదా? అని ప్రశ్నించారు. సురేష్ ఏం తప్పు చేశాడు. మన నాయకులతో మాట్లాడటమే తప్పా? ఆయన భూమి పోతుంటే మాట్లాడకూడదా?,మీ ఆనాలోచిత నిర్ణయాలను మానుకోండి. ఫార్మా విలేజ్ ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.

ఫార్మా సిటీ విషయంలో వీళ్లు హైకోర్టు ను కూడా మోసం చేస్తున్నారు. బయట ఫార్మా సిటీ రద్దు అంటున్నారు. కోర్టులో మాత్రం ఫార్మా సిటీ ఉందని చెబుతున్నారు. ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూములను వేరే అవసరాలకు వాడటానికి వీలు లేదు..ఫార్మా సిటీ పేరుతో ఫోర్త్ సిటీ, స్కిల్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు అని మండిపడ్డారు. ఉద్దేశ పూర్వకంగా గొడవ సృష్టించి రైతులు భూసేకరణకు సహకరించటం లేదని భూములను గుంజుకునే కుట్ర చేస్తున్నారు.సురేష్ భూమి పోతుంటే ఆయన నన్ను వచ్చి కలిస్తే నా పై కేసు పెడుతారా? ,ముఖ్యమంత్రి కి రియల్ ఎస్టేట్ ఫార్ములా, బ్యాగ్ ల ఫార్మూలా మాత్రమే తెలుసు. ఈయనకు ఈ రేస్ అంటే ఏంటో తెలుసా? అన్నారు. 11 నెలలుగా రోజుకో కుంభకోణం పేరుతో టైమ్ పాస్ ప్రచారం చేస్తున్నారు..ఇచ్చిన హామీలు అమలు చేయాలని మీడియా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు.

- Advertisement -