కేసులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు మాజీమంత్రి కేటీఆర్. మేము ఉద్యమ నాయకుడి సైనికులం… రేవంత్ రెడ్డి, నీలాంటి చిల్లర గాళ్ల కేసులకు భయపడే వాడు ఎవడూ లేడు. నువ్వు మా వెంట్రుక కూడా పీకలేవు. లీగల్‌గా కొట్లాడతాం అని తేల్చిచెప్పారు.
మీడియాతో మాట్లాడిన కేటీఆర్…ఈ రహస్య కలయిక దేనికోసం రేవంతూ? చెప్పాలన్నారు. డిసెంబర్ 13న ఫార్ములా-ఈ కంపెనీ కో-ఫౌండర్ మరియు చీఫ్ ఛాంపియన్‌షిప్ ఆఫీసర్ అల్బెర్టో లాంగోను కలిశారు రేవంత్ రెడ్డి…నువ్వు కలిసినట్లు ఇప్పటివరకు ఈ ఫోటోలను మీడియాకు ఎందుకు విడుదల చేయలేదు చిట్టి నాయుడు? చెప్పాలన్నారు.
నిజానికి రేవంత్ రెడ్డి పైనే కేసు పెట్టాలి…ఎందుకంటే.. ఫార్ములా – ఈ రేస్ ను రద్దు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఇండియా, హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీసి, ఇజ్జత్ తీసిండు అని మండిపడ్డారు. కరప్షనే లేనప్పుడు కేసు ఎక్కడిది..రేవంత్ రెడ్డి చేస్తున్న మరొక లత్కోర్ ప్రయత్నమే ఇది అన్నారు. లగచర్ల రైతులను నెల రోజులకు పైగా జైల్లో పెట్టిండు.. ఇవ్వాళ వాళ్ళు బయటకు వచ్చిండ్రు. ఇదీ అట్లాంటిదే అన్నారు.
మేం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడానికి, తెలంగాణను ప్రపంచ పటంలో పెట్టడానికి ఫార్ములా-ఈ రేస్ నిర్వహించాం…కానీ నువ్వు తెలంగాణ పరువు తీసేలా ఫార్ములా-ఈ వాళ్లతోనే కేసులు వేయించుకున్నావ్….రేస్ జరుపుతామని అగ్రిమెంట్ చేసుకొని మధ్యలో రద్దు చేసినందుకు, వాళ్లు రేవంత్ ప్రభుత్వం మీద కేసు పెట్టారు. మరి ఈ కేసు గురించి ఎందుకు చెప్పడం లేదు? చెప్పాలన్నారు.
Also Read:నాడు ధనయజ్ఞం…నేడు జలయజ్ఞం అయిందా: హరీశ్