ఎలాంటి తప్పు చేయలేదు: కేటీఆర్

1
- Advertisement -

ఫార్ములా ఈ రేస్ కేసులో ఎలాంటి తప్పు చేయలేదని తేల్చిచెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎలక్ట్రానిక్ వాహన రంగంలో హైదరాబాద్‌ను గమ్యస్థానంగా మార్చడమనే గొప్ప ఎజెండాతో ఫార్ములా-ఈ కార్ రేసును ముందుకు తీసుకొచ్చామని చెప్పారు.

ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్‌…హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్‌తో పాటు తెలంగాణకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చేందుకే ప్రతిష్టాత్మక ఫార్ములా-ఈని ఎంతో కష్టపడి తీసుకువచ్చామని అన్నారు. విజ్ఞులైన తెలంగాణ ప్రజలకు ఈ అంశం తెలుసన్నారు. తమ ప్రభుత్వ విజన్‌ను, నిజాన్ని తెలంగాణ ప్రజలు తప్పకుండా గుర్తిస్తారని చెప్పారు. ఎప్పటికైనా సత్యం, న్యాయమే గెలుస్తుందని కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

Also Read:తిరుమలలో అపశ్రుతి..6గురు మృతి

- Advertisement -