420 అబద్ధపు హామీల పాపం..“420” రోజుల చేతకాని పాలన శాపం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్.. ఫలితంగా..మాటలకందని మహావిషాదం..తెలంగాణ చెల్లించిన భారీ మూల్యం.. 420 మంది రైతన్నల బలవన్మరణం అన్నారు.
అసమర్థులు అధికారం పీఠమెక్కి..అన్నదాతలను బలిపీఠం ఎక్కిస్తున్నారు..కన్నీటి సేద్యం చేయలేక..భూములున్న కర్షకులే కాదు.. కౌలు రైతులూ పిట్టల్లా రాలిపోతున్నారు..దేశానికే వెన్నుముకైన రైతులకు…కుటిల కాంగ్రెస్ పాలనలో వరుస వెన్నుపోట్లు ఓట్లనాడిచ్చిన హామీలకు లెక్కలేనన్ని తూట్లు పొడిచారన్నారు.
పదేళ్లలో పంజాబ్ నే తలదన్నే స్థాయికి తెలంగాణ..నేడు పెట్టుబడికి పత్తాలేదు.. దిగుబడికి దిక్కులేదు..రుణమాఫీని ఆగంచేసి.. పెట్టుబడి సాయానికి పాతరేసి..ముంచేరోజులు తేవడంవల్లే ఈ అనర్థాలు..చలనం లేని సీఎం, బాధ్యత లేని సర్కారు వల్లే.. మళ్లీ తెలంగాణ పల్లె కన్నీరుపెడుతోంది.. మళ్లీ మరణమృదంగం మోగుతోందన్నారు.
“420” అబద్ధపు హామీల పాపం..
“420” రోజుల చేతకాని పాలన శాపం..ఫలితంగా..
మాటలకందని మహావిషాదం..
తెలంగాణ చెల్లించిన భారీ మూల్యం..
420 మంది రైతన్నల బలవన్మరణం..అసమర్థులు అధికారం పీఠమెక్కి..
అన్నదాతలను బలిపీఠం ఎక్కిస్తున్నారు..కన్నీటి సేద్యం చేయలేక..
భూములున్న కర్షకులే కాదు..
కౌలు… pic.twitter.com/vZMri80qV5— KTR (@KTRBRS) February 7, 2025
Also Read:పీఎం కిసాన్ అప్‌డేట్..