KTR: భూదాహం కాదు..ధాన్యం రాశుల వైపు చూడు

1
- Advertisement -

గుట్టలను మట్టిచేసి భూదాహం తీర్చుకోవడం కాదు రేవంత్ – గుట్టల్లా పేరుకుపోయిన ధాన్యం రాశుల వైపు చూడు అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గాలిమోటర్లో మూటలు మోసుడు కాదు – కొనేవారు లేక పేరుకుపోయిన ధాన్యం మూటల వైపు చూడు అన్నారు.

ఢిల్లీ ముందు మోకరిల్లడం కాదు – పండించిన పంటకు భద్రత లేక గొల్లుమంటున్న రైతన్నల మొహం వైపు చూడు అని ప్రశ్నించారు. నీ కల్లబొల్లిమాటలతో కాలయాపన చేయడం కాదు – ధాన్యం కొనడానికి ముందుకు రాని మిల్లర్ల ముచ్చటేందో చూడు… నీ కాసుల కక్కుర్తి – నీ కేసుల కుట్రలు కాదు – పండిన పంటకు గిట్టుబాటు ధర దక్కక కకావికలం అవుతున్న రైతు బతుకు వైపు చూడు అని ప్రశ్నించారు.

Also Read:పంబా నది టూ శబరిమల..రోప్ వే

- Advertisement -