జేఎన్‌టీయూ ప్రసంగంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని Dr.Guard అనే వాటర్ ప్రూఫింగ్ కంపెనీ స్థాపించారు యువకులు.
యువకుల ప్రయత్నం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కేటీఆర్. వారి కంపెనీకి మొదటి కస్టమర్‌గా తానే ఉంటానని మరింత స్ఫూర్తిని ఇచ్చారు కేటీఆర్.
గతంలో జేఎన్టీయూలో ఒక ఉపన్యాసంలో తాను చెప్పిన మాటలను స్పూర్తిగా తీసుకుని వాటర్ ప్రూఫింగ్ కంపెనీ స్థాపించిన యువకులను కలిసి అభినందించారు కేటీఆర్.
కుల మతాలకు అతీతంగా కష్టపడుతున్న వీళ్లు ఎంతో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను అన్నారు కేటీఆర్. తెలంగాణలో కేసీఆర్ పాలనలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని NCRB వెల్లడించడం మాకు గర్వకారణంగా ఉంది అన్నారు. బీజేపీ పాలిస్తున్న మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.. తెలంగాణ రైతుల ఆత్మహత్యలను తగ్గించగలిగింది అంటే.. వై నాట్ మహారాష్ట్ర..? వై నాట్ అదర్ స్టేట్స్ ? అన్నారు.
Also Read:‘మహాకాళి’..అక్షయ్ రెస్పాన్స్ అదుర్స్

