KTR:రాష్ట్రంలో హెల్త్ ఎమ‌ర్జెన్సీ!

11
- Advertisement -

రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డెంగీ మ‌ర‌ణాల‌పై ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్… రాష్ట్రంలో డెంగీ మ‌ర‌ణాలు లేవ‌ని ప్ర‌భుత్వం చెబుతుంది. కానీ వార్తా ప‌త్రిక‌ల్లో మాత్రం ఒక్క‌రోజులో ఐదు మంది డెంగీతో చ‌నిపోయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయన్నారు.

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో స‌రిపడా మందులు లేవు.. చాలా హాస్పిట‌ల్స్‌లో ఒక్కో బెడ్‌పై ముగ్గురు, న‌లుగురు ఉండి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నార‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ఈ ప‌రిస్థితిని సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించి, రాష్ట్రంలో హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించాల‌ని సీఎస్‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

Also Read:ఇండియా డే వేడుకల్లో టాక్ తెలంగాణం

- Advertisement -