రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ పార్టీ దగా చేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్..రైతు బంధు నిధులను రుణమాఫీకి మళ్లీంచారని ఆరోపించారు. హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బులు ఎప్పుడు జమా చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
2014లోనే కేసీఆర్ సర్కార్ లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి రూ.16,144 కోట్లు వెచ్చించ్చించి సుమారు 35 లక్షల రైతులకు లబ్ది చేకూర్చిందన్నారు. అర్హులైన అందరు రైతులకూ రైతుబంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Also Read:తిరుమలలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..
రుణమాఫీ పేరిట మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్!
👉 రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే రు. 7000 కోట్లు రుణమాఫీకి దారిమళ్లింపు.
👉 హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుండి కొంతమొత్తం విదిల్చి, రుణమాఫీ చేస్తున్నమని పోజులు.
👉 40 లక్షల పైచిలుకు…
— KTR (@KTRBRS) July 18, 2024