తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజా పోరాటంలో బీఆర్ఎస్ వెనక్కి తగ్గదన్నారు. బీఆర్ఎస్ సమావేశం అనంతరం మాట్లాడిన కేటీఆర్… పదేళ్లలో కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
12 నెలల పాటు బీఆర్ఎస్ రజతోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పార్టీ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉంటుందన్నారు. ప్రజా పోరాటంలో బీఆర్ఎస్ వెనక్కి తగ్గదన్నారు.. పార్టీ అనుబంధ విభాగాలను బలోపేతం చేస్తామన్నారు.
ఏప్రిల్ రెండో వారంలో బీఆర్ఎస్ ప్రతినిధుల సభను నిర్వహిస్తామన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రయోజనాల కోసం రక్షణ కవచంలా నిలుస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గాలను ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీకి 8 మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణకు వచ్చింది గుండు సున్నా అన్నారు. ప్రజా పోరాటలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు కేటీఆర్.
తెలంగాణను కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని తెలిపిన కేటీఆర్ … కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టి తీరుతామన్నారు.
Also Read:మళ్లీ అధికారం మనదే: కేసీఆర్
ఏప్రిల్ రెండో వారంలో పార్టీ ప్రతినిధుల సమావేశం హైదరాబాదులో ఉంటుంది. త్వరలోనే తేదీ వేదిక ప్రకటిస్తాం… ఏప్రిల్ 27 నాడు బహిరంగ సభ నిర్వహిస్తాం. ఎక్కడ అనేది నాలుగైదు రోజుల్లో ప్రకటిస్తాం అన్నారు.
ఓవైపు రజతోత్సవ సంబరాలను నిర్వహిస్తూనే పార్టీ నిర్మాణం, ప్రజా పోరాటాలను చేస్తాం అని తెలిపారు కేటీఆర్. సాగునీటి సమస్య, కరెంటు సమస్య, విద్య వైద్యం అందించడంలో జరుగుతున్న లోపాలపై పార్టీ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలతో చెలగాటం ఆడుతున్న విషయంపై సమావేశంలో విస్తృతంగా చర్చించాం…కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పోరాడకుంటే బిఆర్ఎస్ తరఫున మా కార్యచరణను ప్రకటిస్తాం అన్నారు.
ఎనిమిది మంది బిజెపి ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఉన్నప్పటికీ బడ్జెట్లో కేంద్రం నుంచి తెలంగాణకు నయా పైసా రాలేదు.తెలంగాణ ఇంటి పార్టీ బిఆర్ఎస్ ఢిల్లీలో కనుక ఉంటే గతంలో లాగా కేంద్రం మెడలు వంచేందుకు పోరాడేది. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పేది… వంత్ రెడ్డి పరిపాలన సామర్థ్యం ఏ పాటిదోతో తెలంగాణ ప్రజలకు అర్థమైందన్నారు.