పెద్దన్న లెక్క భట్టిని గౌరవిస్తా: కేటీఆర్

6
- Advertisement -

ఉప ముఖ్యమంత్రి బట్టి తోని నాకు 16 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది సభలో కలిసి పని చేస్తున్నాము అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అసెంబ్లీలో మాట్లాడిన కేటీఆర్.. తాను తొలిసారి సభకు వచ్చినప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు అన్నారు.

ఆయన పట్ల ఎప్పుడూ గౌరవం ఉన్నది.. మాకు ఆయనను పెద్దన్న లెక్క గౌరవిస్తాం.. కానీ ఆది శ్రీనివాస్ ఇప్పుడు లేచి అనవసరమైన అన్ని అంశాలు మాట్లాడుతున్నారు అన్నారు. నేను అనలేనా ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి అని 20%, 30% కమిషన్ ప్రభుత్వం అని నేను అనలేను అన్నారు.

కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నరు… చర్య తీసుకోమని అడిగాను , పిసిసి ప్రెసిడెంట్ అధ్యక్ష పదవి ముఖ్యమంత్రి 50 కోట్లకు కొన్నారని మంత్రి కోమటిరెడ్డి మాటలను నేను అనవచ్చు కదా అన్నారు.

Also Read:ఆధార్ అప్‌డేట్‌కు తప్పని తిప్పలు

- Advertisement -