అల్లు అర్జున్‌ ఎపిసోడ్‌పై కేటీఆర్

0
- Advertisement -

అల్లు అర్జున్, సినిమా వ్యవహారంలో కేటీఆర్ స్పందించారు. మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన కేటీఆర్..కొంత ప్రచారం కావాలి, ప్రజా సమస్యల పై నుంచి అటెన్షన్ డైవర్షన్ లో భాగంగానే సినిమా వాళ్ళ పైన రేవంత్ రెడ్డి మాట్లాడారు అన్నారు.

రాష్ట్రంలో జరిగిన మరణాలపైన రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన గురుకుల పాఠశాల విద్యార్థులకు… ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం చెల్లించాలన్నారు. వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళు కుటుంబాలు కాదు మనుషులు కాదు అన్నట్టు.. సినిమా వాళ్లపైన పడి అటెన్షన్ డైవర్షన్ కోసం ముఖ్యమంత్రి పాకులాడారు అన్నారు.

సినిమా వాళ్ళ నుంచి సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు సైలెన్స్ గా ఉన్నాడు..సినిమా వాళ్ళతోపాటు ఆత్మహత్యలు చేసుకున్న గురుకుల విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, రైతన్నలు, నేతన్నల మరణాల పైన స్పందించాలి అన్నారు. వీళ్ళకి కూడా కనీసం 25 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలన్నారు.

Also Read:2025లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక: కేటీఆర్

- Advertisement -