అదానీ విషయంలో బడే భాయ్ ఆదేశించగానే…చోటే భాయ్ అదానీకి రెడ్ కార్పేట్ వేసి స్వాగతం పలికాడు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అదానీకి డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు కుట్ర చేశారు…యాదాద్రిలోని రామన్న పేటలో సిమెంట్ పరిశ్రమ వద్దని ప్రజలు వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పట్టించుకోలేదు అన్నారు.
ఆఫ్రికా సహా దేశంలో ఆయన వ్యవహారంపై ప్రకంపనలు మొదలయ్యాయి అన్నారు. అదానీ పై కేసు పెట్టాలని, జేపీసీ వేయాలని ఎన్నిసార్లు కోరినప్పటిికీ ప్రధాని మోడీ పట్టించుకోలేదు..అదానీ కంపెనీలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు రెండుసార్లు బయటపడిందన్నారు.అమెరికాలో ఓ కోర్టు అదానీ సంస్థ లంచాలు ఇచ్చినట్లు తీర్పు చెప్పింది. అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి చాలా మంది మధ్య తరగతి మదుపర్లు నష్టపోయారు….అదానీ ఎన్నిసార్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రయత్నించిన మేము ఆయనను రానివ్వలేదు అన్నారు.అదానీ మమ్మల్ని కలిసి వ్యాపారం చేస్తామని అడిగాడు. కానీ మేము ఆయనకు మర్యాద పూర్వకంగా ఛాయి తాగించి పంపించేశాం. అదానీతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు..కానీ కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటించిందన్నారు. రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే ఎర్ర తివాచీలు కాంగ్రెస్ పరిచింది…కాంగ్రెస్ కు మాకు ఉన్న తేడా అదే అన్నారు.
అదానీ వ్యవహారంపై ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం…మేము లేవనెత్తిన అంశాలపై ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలని నేను మీడియాను విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. కెన్యా ప్రభుత్వం అన్ని ఒప్పందాలు రద్దు చేసుకున్నప్పుడు…తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఒప్పందాలు రద్దు చేసుకోవాలని రాహుల్ గాంధీ ఎందుకు అడగటం లేదు…బాంబుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదానీతో కాళ్ల బేరం చేసుకున్నాడో లేదా చెప్పాలన్నారు. అది నిజం కాకపోతే నా ఆరోపణలు తప్పని రుజువు చేయాలి.
పొంగులేటి ఇంటి పై ఈడీ రెయిడ్స్ జరిగి ఆరు వారాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు బీజేపీ నుంచి ఈడీ నుంచి ఒక్క మాట రాలేదు..ఎమ్మెల్యే ఫిరాయింపు విషయంలో రీజనేబుల్ పిరయడ్ లోపు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చెప్పిందన్నారు. ముఖ్యమంత్రి ఏడ పోయిన సరే సొల్లు పురాణం మాట్లాడుతూ మొరుగుతున్నాడు..ఆయన ఎంత మొరిగినా సరే మేము మాత్రం సబ్జెక్టే మాట్లాడతాం అన్నారు.మా ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా…రేవంత్ రెడ్డికి దమ్ముంటే లగచర్లకు పోయి రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read:KTR:అదానీతో ఎంవోయూలు ఎందుకు రద్దు చేసుకోరు?