- Advertisement -
భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ సర్జరీ నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాలేకపోయారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరొక రోజు సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని కేటీఆర్ కోరారు.
కేసీఆర్ వెంట ఆస్పత్రిలో ఉన్నందున ఈరోజు తెలంగాణ భవన్ లో జరిగిన టిఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి కూడా కేటీఆర్ హాజరు కాలేకపోయారు. కెసిఆర్ గారి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఎమ్మెల్యేగా మరోరోజు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు.
Also Read:గాంధీభవన్‌లో సోనియా బర్త్ డే వేడుకలు..
- Advertisement -