కేటీఆర్ నల్గొండ టూర్ రద్దు..

3
- Advertisement -

బీఆర్ఎస్ చేపట్టబోయే రైతు మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. క్లాక్ టవర్ సెంటర్ లో పార్కింగ్,ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో అనుమతి ఇవ్వలేదు పోలీసులు.పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్ట్ ను ఆశ్రయించారు బీఆర్ఎస్ నేతలు.

పోలీసుల అనుమతి విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోలేమని చెప్పింది హైకోర్ట్. ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభల నేపథ్యంలో బందోబస్తు ఇవ్వలేమని హైకోర్ట్ లో వాదనలు నడిచాయి. ఈ నెల 26 తర్వాత రద్దీ ప్రాంతంలో కాకుండా అనువైన ప్రాంతంలో సభ నిర్వహించుకునేందుకు అభ్యంతరం లేదనే వాదనలు వింది హైకోర్టు….

ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతల లంచ్ మోషన్ పిటీషన్ 27కు వాయిదా వేసింది న్యాయస్థానం. దీంతో కేటీఆర్ నల్గొండ టూర్ రద్దైంది.

Also Read:#BSS12.. అప్‌డేట్

- Advertisement -