భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతుండటంపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నువ్వు పెట్టినవారా జిల్లాలు తీసేయడానికి? రెండేళ్ల పాలనలో ఈ పొట్టోడు ఏం సాధించాడు?” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తే ప్రజలు రేవంత్ రెడ్డి వీపు చింతపండు చేస్తారని హెచ్చరించారు.
అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మసకబారితే నకిలీ తెలుగుదేశం నేత ముఖ్యమంత్రి అయ్యాడని విమర్శించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ల మీద పెత్తనం చేయాలి కానీ కేసీఆర్‌ను ఒక్క మాట అంటే బిడ్డా ఖబడ్దార్ అంటూ హెచ్చరిక జారీ చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాను కొత్తగా ఏర్పాటు చేసి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది మాజీ సీఎం కేసీఆర్ అని గండ్ర వెంకటరమణా రెడ్డి గుర్తుచేశారు. సాగునీరు, రోడ్లు, మౌలిక వసతులు, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు ద్వారా జిల్లాకు గుర్తింపు తెచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.
అడ్డమైన, అమలుకాని హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. భూపాలపల్లి జిల్లాను తీసేస్తే ఇక్కడి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అంటూ హెచ్చరిస్తూ, జిల్లాపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తీవ్ర ప్రతిఘటన తప్పదని స్పష్టం చేశారు.
Also Read:ఎన్నికల ప్రచారం..మాజీ మంత్రి హరీష్ రికార్డ్

