సిరిసిల్లలో కేటీఆర్ మార్నింగ్ వాక్..

28
- Advertisement -

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కి మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

మార్నింగ్ వాక్ చేసుకుంటూ పట్టణంలోని రైతు బజార్ వద్ద రైతన్నలు, ప్రజలను కలుసుకొని వారితో ముచ్చటించారు. అనంతరం గాంధీ చౌక్ వద్ద పాత మార్కెట్ లో వ్యాపారస్తులను, ప్రజలను కలిశారు. విద్యావంతుడు, కరీంనగర్ ను అభివృద్ది చేసిన వ్యక్తి, మన సమస్యల పట్ల అవగాహన ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ గారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

- Advertisement -