ఫ్లోరైడ్‌ బాధితుడి ఇంట్లో భోజనం చేసిన కేటీఆర్‌

45
- Advertisement -

తెలంగాణ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫ్లోరైడ్‌ బాధితుడు అంశాల స్వామి ఇంట్లో భోజనం చేశారు. గురువారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా చండురూలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న కేటీఆర్‌ అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. కార్యక్రమం అనంతరం అంశాల స్వామి ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వామి ఇంట్లోనే భోజనం చేశారు. వీరితో పాటుగా జగదీశ్‌రెడ్డి తదితర టీఆర్ఎస్‌ నాయకులు కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా స్వామి యోగక్షేమాలు, ఇంటి నిర్మాణం, హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌ గురించి ఆరా తీశారు. భవిష్యత్తులో కుటుంబానికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని హామీనిచ్చారు. గతంలో అంశాల స్వామి పరిస్థితి తెలుసుకొని వ్యక్తిగతంగా సహాయం కూడా చేశారు. దాంతో పాటు ప్రభుత్వం నుంచి డబుల్‌ బెడ్రూంను మంజూరు చేయించారు. టీఆర్ఎస్‌ సీనియర్‌ నాయకుడు కర్నాటి విద్యాసాగర్‌ రావు అంశాల స్వామి ఇంటి నిర్మాణ పనులను పర్యవేక్షించాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.

- Advertisement -