కేంద్ర మంత్రితో కేటీఆర్ భేటీ.. కీలక చర్చ..

62
ktr
- Advertisement -

ఢిల్లీలో బుధవారం కేంద్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ తో రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రితో పలు విషయాలపై చర్చించారు. భార‌త ఎల‌క్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ ప‌రిశ్ర‌మ‌లో ఉన్న అభివృద్ధి అవ‌కాశాల‌పై కేంద్ర మంత్రితో కేటీఆర్ చ‌ర్చించారు. పారిశ్రామికవేత్త‌ల‌కు అనుకూల‌మైన ఎకోసిస్ట‌మ్‌ను సృష్టించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంద‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. మంత్రి కేటీఆర్ వెంట టీఆర్ఎస్ లోక్ సభ ఎంపీలు సురేష్ రెడ్డి,నామా నగేశ్వరరావు,పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జేయేష్ రంజన్ ఉన్నారు.

- Advertisement -