పీయూష్‌ని కలిసిన కేటీఆర్‌..పారిశ్రామిక కారిడార్‌ల కోసం వినతి

413
ktr
- Advertisement -

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యారు మంత్రి కేటీఆర్. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఫిబ్రవరి 17న హైదరాబాద్లో జరిగే బయో ఆసియా సదస్సుకు హాజరుకావల్సిందిగా పీయూష్ గోయల్‌ని ఆహ్వానించారు కేటీఆర్.

వరంగల్,హైదరాబాద్‌ కారిడార్‌లను వేర్వేరుగా కారిడార్‌లుగా మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్-బెంగళూరు-చెన్నై మధ్య దక్షిణాది పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుచేయాలని కోరారు. వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో ఏర్పాటు చేయనున్న డ్రై పోర్టుతో పాటు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులకు మద్దతివ్వాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఇంటిగ్రేటెడ్ పార్మాక్లస్టర్, ఫార్మాసిటీ జహీరాబాద్ నిమ్జ్‌ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు పీయూష్.

- Advertisement -