పాలమూరు నేతలతో కేటీఆర్ భేటీ

18
- Advertisement -

తెలంగాణ భవన్ లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా రానున్న ఎన్నికలకు సంభందించిన కార్యాచరణపైన చర్చించారు. రానున్న లోక్ సభ, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పైన చర్చించారు. ఇప్పటికే ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల అయింది.

ఈ రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ఎన్నిక పైన చేపట్టాల్సిన కార్యాచరణ పైన చర్చించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానంతో పాటు నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానంలో అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చించారు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పైన పార్టీ అధినేత కేసీఆర్ ఒక విస్తృతస్థాయి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఎమ్మెల్సీతో పాటు లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన పరిస్ధితులను కేసీఆర్ కి విజ్ఞప్తి చేస్తామని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఈ రెండు లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయ అవకాశాలు బలంగా ఉన్నాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read:Kavitha:మోడీ పెద్దన్న ఎలా అవుతాడు?

- Advertisement -