లండన్ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడి పార్టీ ఎన్ఆర్ఐ నేతలతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలన్న పార్టీ అధినేత కేసీఆర్ గారి సూచన మేరకు ఇంగ్లాండ్ లో కూడా నిర్వహించాలని ఎన్ఆర్ఐ నేతలు కేటీఆర్ ని కోరారు.
ప్రాంతాలకు అతీతంగా యూకేలో ఉన్న తెలుగు వాళ్లంతా ఈ సంబరాల్లో పాల్గొనడానికి ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. దీంతో పార్టీ రజతోత్సవ సంబరాలను యూకేలో కూడా నిర్వహించడానికి కేటీఆర్ నిర్ణయించారు.
ఈ సందర్భంగా ఒకటిన్నర సంవంత్సర కాలంగా తెలంగాణలో కాంగ్రెస్ చేస్తున్న దోపిడి, అరాచకాలు, ప్రజలపై జరుపుతున్న వేధింపులను బాగా ఎండగడుతున్నారని యూకే ఎన్ఆర్ఐ నేతలను కేటీఆర్ మెచ్చుకున్నారు. ఇంగ్లాండ్ లో ఉన్న సోషల్ మీడియా వారియర్స్ పై కూడా అక్రమ కేసులు పెట్టినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా రేవంత్ ప్రభుత్వ దాష్టీకాలను ప్రశ్నిస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుందని, ఖండతరాల్లో ఎక్కడ ఉన్నా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న మోసాలను లేవనెత్తాలని ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు.
Also Read:రేప్ కేసులో సుప్రీం సంచలన వ్యాఖ్యలు

