తెలంగాణకు సిస్కో చైర్మన్ జాన్ చాంబర్స్ ప్రశంసలు

243
KTR meets Cisco chief
KTR meets Cisco chief
- Advertisement -

తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం పలు డిజిటల్ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేందుకు సిస్కో ఆసక్తి చూపిందని తెలంగాణ పరిశ్రమలు, మరియు ఐటి శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. అయన ఈ రోజు సిలికాన్ వ్యాలీలోని సిస్కో కార్యాలయంలో సంస్ధ చైర్మన్ జాన్ చేంబర్స్ సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. మంత్రి కెటి రామారావుకు సిస్కో చైర్మన్ నుంచి అపూర్వమైన స్వాగతం లభించింది. జాన్ చాంబర్స్ స్వయంగా ప్రధాన గేటు వరకు వచ్చి మంత్రిని తొడ్కొని వెళ్లారు. చాంబర్స్ తమ కంపెనీ ఎక్స్ ఫీరియన్స్ సెంటర్ లోని విశేషాలను వివరించారు.

_DSC4617

ఈ సందర్భంగా ఇండియాలోని సిస్కో ప్రతినిధుల బృందాన్ని సైతం అందుబాటులో ఉంచిన జాన్ చాంబర్స్, మంత్రి చేసిన పలు అంశాలపైన వారికి సూచనలు సైతం అందించారు. ప్రపంచం డిజిటలైజేషన్ దిశగా సాగుతుందన్న చాంబర్స్, డిజిటల్ ఇండియా, డిజిటల్ తెలంగాణ విషయంలో సిస్కో కంపెనీకున్న అలోచనలను ఒక ప్రేజేంటేషన్ ద్వారా మంత్రికి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, టి హబ్ వంటి కార్యక్రమాలపైన పూర్తి అవగాహణ ఉందన్నారు. తెలంగాణ రాష్ర్టంపైన సిస్కో చైర్మన్ ప్రసంశలు కురింపించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింకి ఇంటర్నెట్ ఇవ్వడం ద్వారా డిజిటల్ తెలంగాణ సాద్యం అవుతుందన్నారు. డిజిటలైజేషన్ వలన ప్రజల జీవీతాల్లో మార్పులు వస్తాయన్నారు.

_DSC4671

డిజిటలైజేషన్ ద్వారా అర్ధిక వ్యవస్ధ బలోపేతం అవ్వడంతోపాటు గ్రామీణ సమాజంలో మార్పులు వస్తాయన్నారు. ఈ డిజిటలైజేషన్ ద్వారా ప్రభుత్వాలు సైతం పౌరసేవల్లో ఘననీయమైన మార్పు వస్తుందని, వీడియో ఇంటరాక్టివ్ టెక్నాలజీ ద్వారా ఈ హెల్త్, ఈ ఎడ్యూకేషన్ రంగాల్లో అనేక ప్రయోజనాలుంటాయని తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు తరువాత ఏలాంటి మార్పులు వస్తాయో తెలియజేసే టెక్నాలజీ డెమాన్ స్ర్టేషన్ నెట్ వర్క్ (Technology demonstration network) నిర్మాణం చేసేందుకు సహకరిస్తామని తెలిపారు. ఈమేరకు సిస్కో ఇండియా టీం ను జాన్ చాంబర్స్ తెలంగాణ ప్రభుత్వం తో చర్చలు నిర్వహించాలని అదేశించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టి హబ్ లోని స్టార్ట్ అప్స్, హైదారాబాద్ ఎంటర్ ప్రెన్యూర్స్ తో తాను మాట్లాడేందుకు, వారికి మార్గనిర్శేశం చేసేందుకు సిస్కో టెలి ప్రెసెన్సుతో సంభాషిస్తానన్నారు. తెలంగాణ ప్రభుత్వం సిస్కో సొల్యూషన్స్ ద్వార ఓక పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని కోరారు.

_DSC4695

సిస్కోకు డిజిటలైజేషన్ పట్ల వాటి ప్రయోజనాల పట్ల ఉన్న విజన్ వివరించినందుకు చైర్మన్ కు దన్యవాదాలు తెలిపిన మంత్రి, తెలంగాణ డిజిటలైజేషన్ రంగంలో చేపట్టిన పలు అంశాలను వివరించారు. ముఖ్యంగా డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాలను వివరించారు. డిజిటల్ మౌళిక వసతుల రంగంలో ఫైబర్ గ్రిడ్ ఒక మైలు రాయిగా నిలుస్తుందన్నారు. సిస్కో కంపెనీ తయారీ యూనిట్ ఎర్పాటు అంశాన్ని పరిశీలించాలని కోరారు. సిస్కో చైర్మన్ అతిధ్యానికి మంత్రికి దన్యవాదాలు తెలిపారు. మంత్రితోపాటు ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఉన్నారు.

నూతన వెబ్ టీవి చానల్ ను ప్రారంభించిన మంత్రి కెటి రామారావు
నూతన వెబ్ టీవి చానల్ ను మంత్రి కెటి రామారావు ప్రారంభించారు. సాంట క్లారాలో హ్యయత్ రిజెన్సీ హోటళ్ళు జరిగిన ప్రారంభ వేడుకలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే మైక్ టివిని ప్రారంభించారు. no noise only voice ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ టీవీకి విజయవంతం కావాలని మంత్రి అభిలాషించారు. మంచి వార్తా విలువలతో ముందుకు సాగాలని కోరారు.

- Advertisement -