KTR:ఫార్మాసిటీ విషయంలో భంగపాటే!

6
- Advertisement -

లగచర్లలో భూముల సేకరణ అంశంలో ప్రభుత్వం తీవ్రంగా భంగపడిందన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన కేటీఆర్… దాన్ని కవర్ చేసుకునేందుకే ఇది కుట్ర అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నారు. ఈ ప్రభుత్వం రైతుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తోంది… దాడి చేశారంటూ దాదాపు 50 మంది రైతులను స్థానిక ఎస్పీ దగ్గరుండి కొట్టించాడు అన్నారు.

రైతులను పరామర్శించేందుకు వెళ్లిన మా పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తో రైతులు తమ ఆవేదన చెప్పుకున్నారు… ఇంకా ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్లను కొట్టి మిగతా పార్టీ వాళ్లను వదిలేశారు. సంఘటన జరిగినప్పుడు అక్కడ లేని బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తీసుకెళ్లి అమానుషంగా కొట్టారు అన్నారు.రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే గతంలో మానవ హక్కుల గురించి మాట్లాడిన కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్లు ఎందుకు మాట్లాడటం లేదు అన్నారు.

నిజంగా లగచర్లలో మేము కుట్ర చేసినట్లైతే మీడియా వాళ్లు వెళ్లి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు. మీరు ఆ గ్రామానికి వెళ్తే ప్రజలే ఏమీ జరిగిందో చెబుతారు..సురేష్ అనే వ్యక్తి మా పార్టీ కార్యకర్తే. ఆయనకు భూమి లేకపోయినా గొడవ చేశాడని అంటున్నారు. కానీ సురేష్ కు భూమి ఉందన్నారు. భూమి లేని వాళ్లే గొడవ చేశారంటూ పోలీసులు తప్పుడు సమాచారం ఇస్తున్నారు…పోలీసులు, ఐపీఎస్ అధికారులారా ఇంత స్వామి భక్తి వద్దు. మళ్లీ నాలుగేళ్ల తర్వాత మేమే అధికారంలోకి వస్తాం అన్నారు.

తప్పు చేసిన అధికారుల విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది..లగచర్ల లో జరిగిన ఘటనలో పూర్తిగా ఇంటలిజెన్స్, పోలీసుల వైఫల్యం ఉందన్నారు. అభిప్రాయ సేకరణ జరుగుతున్న సమయంలో పోలీసులు ఎందుకు అక్కడ లేరు….పట్నం నరేందర్ రెడ్డి ఏదో నా పేరు చెప్పాడని రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. కానీ అదంతా బాక్వాస్ అని పట్నం నరేందర్ రెడ్డి లేఖ రాశారు అన్నారు. రైతులపై దాడికి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ కు వెళ్లినట్లు వెళ్లారు..
పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తూ రైతులను ఇష్టమొచ్చినట్లు కొట్టారు అన్నారు.

ఒక అమ్మాయి ఛాతి మీద కాలు పెట్టి ఆమె భర్తను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ విషయాన్ని ఆ అమ్మాయి మీడియాతో చెబుతూ ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది..నా మీద కేసు పెడితే నేను ఊరుకుంటా అనుకుంటే రేవంత్ రెడ్డి అంతే పిచ్చోడు మరొకరు ఉండరు అన్నారు.జైలు నుంచి వచ్చాక కూడా పోరాటం చేస్తా…రైతులను పోలీసులు తీవ్రంగా కొట్టారు. వారికి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేయించలేదు..ఈ విషయాన్ని ఇంతటితో నేను వదిలిపెట్టను. ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల, మహిళా కమిషన్ వరకు ఈ విషయాన్ని తీసుకెళ్తా అన్నారు.

ఫార్మా సిటీ ని కేసీఆర్ మంచి ఉద్దేశంతో ముచ్చర్లలో పెట్టారు. అందుకోసం చైనాకు వెళ్లి అక్కడ 70 వేల ఎకరాల్లో ఉన్న తయారీ పరిశ్రమను పరిశీలించి వచ్చారు..ఎకానమీ ఆఫ్ స్కేల్ అనే ప్రయోజనం ఉండే విధంగా ఫార్మాసిటీ ని ప్లాన్ చేశారు. ఫార్మాసిటీ కోసం 8 ఏళ్లు కష్టపడ్డాం. 14 వేల ఎకరాల భూమి సేకరించాం అన్నారు. కొడంగల్ లో భూముల సేకరణకే ఇంత గొడవ జరిగితే…ముచ్చర్లలో ఎంతో విలువైన భూములు ఉన్నాయి. వాటిని సేకరించే విషయంలో ఇంకా ఎంత గొడవ జరగాలి? , కానీ మేము రైతులను ఒప్పించి వారికి నచ్చచెప్పి భూసేకరణ చేశాం అన్నారు.

Also Read:TTD:శ్రీవారికి రూ.2 కోట్ల హారం విరాళం

ఫార్మాసిటీ పర్మిషన్ కోసం కేంద్రంలో ఉన్న వాళ్లు చెప్పిన అన్ని కండిషన్స్ ఒప్పుకోని 18 నెలలు కష్టపడితే పర్మిషన్ వచ్చింది…ఈ ముఖ్యమంత్రికి ఏమీ తెలియదు. అందుకే రాగానే ఫార్మాసిటీ రద్దు అంటూ ప్రకటన చేసేశాడు అన్నారు. ప్రజలను ఎప్పటికీ మోసం చేస్తామంటే కుదరదు..నేను ఢిల్లీ కి పోయి కాంగ్రెస్ వాళ్ల మీద ఫిర్యాదు చేశాను. బీజేపీ తో దోస్తీ మాకు అవసరం లేదు అన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్లు ఇక్కడ గల్లీల్లోనే బీజేపీ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు…రేవంత్ రెడ్డి కి నేనంటే చాలా ప్రేమ ఉన్నట్లు ఉంది. అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నాడు అన్నారు కేటీఆర్.

- Advertisement -