గుండె సంబంధిత ఆపరేషన్ తరువాత కోలుకుంటున్న ఎన్నారై బీఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలంను, లండన్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా అనిల్ ఇంటికి వెళ్లి పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మలిదశ ఉద్యమంలో దశాబ్ద కాలం పాటు ఇంగ్లాండ్ తెలంగాణ వాదాన్ని వినిపించిన అనిల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మలిదశ ఉద్యమకాలంలో దశాబ్దం పాటు యునైటెడ్ కింగ్ డమ్ లో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించి, ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకుని కోలుకుంటున్నారు. అనిల్ ను ఆప్యాయంగా పలకరించి ఆయన ఆరోగ్య స్థితిపై వాకబు చేశారు. కుటుంబసభ్యులతో మాట్లాడి వారి మంచి చెడు అడిగి తెలుసుకున్నారు.
కేసీఆర్ అంటే అంతులేని అభిమానంతో, అత్యంత నిబద్ధతతో పార్టీ కోసం పనిచేసే అనిల్ త్వరగా కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో మునుపటి జోష్ తో పాల్గొనాలని కోరుకున్నారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని కేటీఆర్ కు తెలిపిన అనిల్, తనను చూడడానికి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా తనను చూడడానికి వచ్చిన యూకేలోని తెలంగాణ వాసులతో కేటీఆర్ ముచ్చటించారు.
Also Read:నోటి దుర్వాసనా….జాగ్రత్త!

