కళాకారులకు సరికొత్తవేదిక..సినారే సారస్వత సదనం

209
ktr
- Advertisement -

సినారె సాహిత్య సదనం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో సినారె కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్.తెలంగాణ వైతాలికులను స్మరించుకుంటూ.. పలు కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. పద్మభూషణ్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా.సి.నారాయణ రెడ్డి 89వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్ లో డా.సినారె సారస్వత సదనం నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన కేటిఆర్….
అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ప్రతిభ, పాండిత్యం, ప్రజ్ఞ అన్నీ కలగలిపిన వ్యక్తి సినారె.దక్షిణ భారతదేశం నుండి రాజ్యసభ కు వెళ్లిన మొట్ట మొదటి కవి సినారె అని కొనియాడారు.
తెలంగాణ కవులు, కళాకారులకు ఇదొక కొత్త వేదిక…. సాధ్యమైనంత త్వరగా ఈ సారస్వత సదనం నిర్మాణం పూర్తి చేస్తాం అన్నారు.సిరిసిల్లలో గ్రంధాలయానికి సినారె గారి పెరు పెట్టుకున్నాం. ఆయన జయంతి సందర్భంగా ఇవాళ విగ్రహావిష్కరణ చేస్తాం అన్నారు.

రాష్ట్రం ఏర్పాటైన నాటి నుండి కళలు, కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి తో ప్రోత్సహిస్తోందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌.డా. సినారె మృత్యర్ధం బంజారాహిల్స్ లో ఇండోర్ ఆడిటోరియం నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సత్వరం 10 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి చొరవ చూపింది.స్వతహాగా కవి, సాహితీవేత్త అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ సినారె ని స్మరించుకుంటూ.. ఈ భవన నిర్మాణానికి సంకల్పించారు.పాఠ్య పుస్తకాలలోనూ సినారె చరిత్ర ఉండేలా చొరవ తీసుకుంటాం అన్నారు.

- Advertisement -