KTR:బీజేపీ స్టీరింగ్ అదానీ చేతిలో

48
- Advertisement -

హైదరాబాద్ నలువైపులా ఐటీని విస్తరిస్తున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. మలక్ పేట్ లో 701 కోట్ల రూపాయలతో భారీ ఐటీ టవర్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన కేటీఆర్..36 నెలల్లో ఈ ఐటీ టవర్‌ను ప్రారంభిస్తామని చెప్పారు.

బీఆర్‌ఎస్‌ స్టీరింగ్‌ కేసీఆర్‌ చేతిలో.. ఎంఐఎం స్టీరింగ్‌ అసదుద్దీన్‌ చేతిలో ఉంది.. బీజేపీ స్టీరింగ్‌ మాత్రం అదానీ చేతిలో ఉందని అన్నారు. హైదరాబాద్ గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీక అన్నారు. హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాలకు మెట్రో విస్తరిస్తామని చెప్పారు. ఓల్డ్‌ సిటీకి మెట్రో తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

చిన్నప్పుడు మలక్‌పేట్‌ అంటే టీవీ టవర్‌ అనేవాళ్లని, రాబోయే రోజుల్లో మలక్‌పేట అంటే ఐటీ టవర్‌ అంటారన్నారు. 44.20 ఎకరాల్లో ఐటీ టవర్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. అయితే మొదటి విడతగా 10.35 ఎకరాల్లో రూ.1,032 కోట్ల వ్యయంతో 21 అంతస్తులతో 20 లక్షల చదరపు అడుగుల్లో ఐటెక్‌ న్యూక్లియస్‌ ఐటీ టవర్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఉత్తరాన కొంపల్లి, పరిసర ప్రాంతాలు, తూర్పున ఉప్పల్, పోచారం, దక్షిణాన శంషాబాద్, ఆదిభట్ల ప్రాంతాలకు విస్తరించింది ఐటీ రంగం.

Also Read:Tiger Nageshwarao:లవణంగా రేణు

- Advertisement -