కేటీఆర్‌పై తప్పుడు కేసు..ఏసీబీకి సంబంధం లేదు!

7
- Advertisement -

రాజకీయ కక్షతోనే కేటీఆర్‌పై కేసు నమోదు చేశారని…ఈ కేసుతో ఏసీబీకి సంబంధం లేదన్నారు కేటీఆర్ తరపు లాయర్ సుందరం..ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఏసీబీకి ఏం సంబంధం అన్నారు. కోడు ఉల్లంఘన జరిగితే ఈసీ చూసుకుంటుంది…రేసు కోసం నిర్వాహకులకు నిధులు చెల్లిస్తే కేటీఆర్ పై కేసు ఎందుకు పెట్టారు చెప్పాలన్నారు సుందరం.

కేటీఆర్ ఎక్కడ లబ్ధి పొందారు? చెప్పాలన్నారు. ప్రాథమిక దర్యాప్తు జరపకుండా కేసు రిజిస్టర్ చేయడం చట్ట విరుద్దం అన్నారు.అఫెన్స్ జరిగిందని తెలిశాక మూడు నెలలలోపే కేసు రిజిస్టర్ చేయాలి…11 నెలల తర్వాత కేసు నమోదు చేశారు అన్నారు. 2023, అక్టోబర్ నెలలో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారమే FEOకి చెల్లించారు…అగ్రిమెంట్ ప్రకారం చెల్లింపులు చేస్తే ఉల్లంఘన ఎలా అవుతుంది? అన్నారు. ఫార్ములా ఈ- కార్ రేసింగ్‌లో నేర పూరిత దుష్ప్రవర్తన ఎక్కడా జరగలేదు,13(1)A, 409 సెక్షన్లు వర్తించవు అన్నారు.

ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరిగితే ఈసీ పరిశీలించాలి.. కానీ ఏసీబీకి సంబంధం లేదు అన్నారు. రేస్ కోసం నిర్వాహకులకు నిధులు చెల్లిస్తే, కేటీఆర్ మీద కేసు ఎందుకు పెట్టారు? అన్నారు. ఫార్ములా-ఈ రేస్ నిర్వహించడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేనట్టు ఉందని…ఒక వేళ రేస్ నిర్వహించడం ఇష్టం లేకపోతే అది ప్రభుత్వ ఇష్టం కానీ ఇందులో అవినీతి ఎక్కడ ఉందన్నారు.సీజన్ 9 రేస్ వల్ల రూ.700 కోట్లు లాభం వచ్చింది… 18 సాయంత్రం 5 గంటలకు ఫిర్యాదు వస్తె 19 న కేస్ నమోదు చేశారు అన్నారు.

Also Read;Parliament: లోక్‌సభ నిరవధిక వాయిదా

- Advertisement -