పురపాలనలో మున్సిపల్ కమీనర్ల పాత్ర కీలకమైనదన్న మంత్రి కెటి రామరామారావు తెలిపారు. పట్టణాల పారిశుద్యం, మౌళిక వసతులు కల్పనలో అదర్శవంతమైన అచరణల నుంచి పరస్పరం నేర్చుకునేందుకే ఏకీకృత సర్వీస్ రూల్స్ ను తీసుకుని వచ్చినట్లు మంత్రి తెలిపారు. పట్టణాల అభివృద్దిలో మున్సిపల్ ఉద్యోగుల సేవలు ఘననీయమైనవన్నారు.
వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీ పెంచేందుకు తీసుకుంటున్న పలు చర్యలను మున్సిపల్ ఉద్యోగుల స్వయంగా మద్దతు పలకడం స్వాగతించదగిన విషయంగా ఆయన తెలిపారు. ఉద్యోగులు ఉద్యమంలో కొట్లాడిన తీరుగానే తెలంగాణ అభివృద్ది కోసం పనిచేస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యొగ ప్రెండ్లీ ప్రభుత్వమని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ మున్సిపల్ కమీషనర్ల డైరీని మంత్రి కెటీఆర్ సచివాలయంలో ఈ రోజు అవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…త్వరలోనే మున్సిపల్ కమీషనర్లు, ఇతర మున్సిపల్ సిబ్బందితో ఒకటి రెండు వారాల్లో ప్రత్యేకంగా సమావేశం అవుతానని అన్నారు. ఈ సమావేశంలో ఉద్యోగులు తమ అనుభవంతో వివిధ సమస్యలకు పరిష్కాలు వెతుక్కుని రావాలని, ఇప్పుడున్న పద్దతులు, కార్యక్రమాల అమలును మరింత ప్రభావ వంతంగా చేసేలా పనిచేయాలని సూచించారు. కమీషనర్లు విధులు నిర్వహిస్తున్న పట్టణాల్లో, జోన్లతో పలు సమస్యల పరిష్కారానికి ఏదైనా పైలెట్ ప్రాజెక్టుతో ముందుకు వస్తే తానే స్వయంగా సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో ఏ ఎస్ సీ ఐ వంటి సంస్ధలతో శిక్షణ ఇస్తామన్నారు. గతంలో ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇచ్చినట్టే మున్సిపల్ సిబ్బందికి సైతం ఒక రోజు శిక్షణ కార్యక్రమం చేపడతామన్నారు. మున్సిపల్ ఉద్యోగులకు ఎవైనా సర్వీస్ రూల్స్ సమస్యలు ఉంటే పురపాలన శాఖ కార్యదర్శితోపాటు తన దృష్టికి తీసుకరావచ్చని మంత్రి కేటీఆర్ తెలిపారు.
విధి నిర్వహాణలో మాత్రమే మంత్రినని, మిగిలిన అన్ని విషయాల్లో సోదరుడిలాగా అండగా ఉంటానన్నారు. ముఖ్యమంత్రి మిషన్ కాకతీయ, భగీరథల మాదిరే పట్టణ మౌళిక వసతుల కల్పన కోసం ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ సారి బడ్జెట్‌లో పురపాలనకు మరిన్ని నిధులు ఇవ్వాల్సిందిగా కోరతామని మంత్రి తెలిపారు. పట్టణాల పట్ల ముఖ్యమంత్రి అలోచనలు అమలులోకి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.
ముఖ్యంగా సీఎం కేసీఆర్ సూచించిన పట్టణ పారిశుద్యం మీద ఇప్పటికే దృష్టి సారించామని… దీంతోపాలు పట్టణాల్లో మాడల్ మార్కెట్లు, నర్సీలు, పార్కుల వంటి ప్రజా సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నిస్తున్ని మంత్రి పేర్కొన్నాడు. పట్టణాలకు తమిళనాడు మాడల్ మాదిరే ఒక సమీకృత నిధిని ఏర్పాటు చేసి, పట్టణ పరిపాలన సంస్ధలకు రుణాల రూపంలో నిధులు కేటాయించే పద్దతి కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు.