కాంగ్రెస్…దేశానికి పట్టిన శని

203
KTR Lasehes out Congress
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన శని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఏర్పాటుచేసిన ప్రగతి సభలో మాట్లాడిన కేటీఆర్..కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీది మోసాల చరిత్ర అని దుయ్యబట్టారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని మూసివేయాలని మహాత్మాగాంధీ చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలను పిట్టల్లా కాల్చి చంపారని తెలిపారు. తెలంగాణకు కాంగ్రెస్ ఒరగబెట్టిందేమి లేదని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రజలంతా తిరగబడితే తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రాకు నెహ్రూ బలవంతపు పెళ్లి చేశారని ఎద్దేవా దేశారు.

ఇంటింటికి తాగునీరు ఇవ్వకపోతే ఓట్లు అడగబోమని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు కేటీఆర్. పూర్వ ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి తీరుతమని కేటీఆర్ వెల్లడించారు. దేశంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీలు సీతారాంనాయక్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -