KTR:అలా చేస్తే తప్పకుండా సహకరిస్తాం

22
- Advertisement -

వచ్చే అసెంబ్లీ సమావేశాలను 20 రోజుల పాటు నిర్వహించాలని అలా చేస్తే తమ పార్టీ వైపు నుండి ఖచ్చితంగా సహకరిస్తామని తేల్చిచెప్పారు మాజీ మంత్రి కేటీఆర్. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మాట్లాడిన కేటీఆర్…ఒకే రోజు 19 ప‌ద్దుల‌పై చ‌ర్చ జ‌రిపి అప్రూవ్ చేసుకోవాల‌నే ఉద్దేశంతో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున‌ 3 గంట‌ల వ‌ర‌కు స‌భ‌ను న‌డిపారని వెల్లడించారు.

సుదీర్ఘ ప్ర‌సంగాలు చేయొద్ద‌న్న శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల మంత్రి ప్ర‌తిపాద‌న‌ను అంగీక‌రిస్తున్నాము. కానీ ఈ స‌భ‌లో 57 మంది కొత్త స‌భ్యులు ఉన్నారు.. వారంద‌రూ మాట్లాడాల‌ని అనుకుంటున్నారని చెప్పారు. ఇలా రోజుకు 19 ప‌ద్దుల‌పై చ‌ర్చ పెట్ట‌కుండా.. రోజుకు 2 లేదా 3 ప‌ద్దుల‌పైన చ‌ర్చ పెట్టాల‌ని కోరుతున్నాం అన్నారు. దీనివల్ల మంత్రులు కూడా సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చే అవకాశం ఉంటుందని వెల్లడించారు. వచ్చే సెషన్ సమావేశాలను 20 రోజులు పెట్టాలని అలా చేస్తే తమ పార్టీ వైపు నుండి సహకరిస్తామని తెలిపారు.

Also Read:నానబెట్టిన ఖర్జూరతో ప్రయోజనాలు తెలుసా?

- Advertisement -