వారి కోసమే హరీశ్ బావతో ఛాలెంజ్ చేశా-కేటీఆర్

254
- Advertisement -

ఇటీవల ముగిసిన లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్‌దే గెలుపు అని పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ దీమా వ్యాక్తం చేశారు. అయితే లోక్‌ సభ ఫలితాలు రాకముందే జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మే 20 లోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారని కేటీఆర్ తెలిపారు. అవినీతి నిర్మూలన లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. కొత్త మున్సిపల్ చట్టం ఆమోదంతో పాటు రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో ఈ రోజు మీడియా ప్రతినిధులతో పలు అంశాలపై కేటీఆర్ మాట్లాడారు.

KTR

ఈ నేపథ్యంలో కేటీఆర్‌.. బావ హరీశ్ రావుతో ఓట్ల మెజారిటీపై ఛాలెంజ్ చేసిన విషయమై స్పందించారు. ప్రజలను ఉత్సాహపరచడానికే అప్పుడు తాను హరీశ్ రావుతో సరదాగా ఛాలెంజ్ విసిరానని కేటీఆర్ తెలిపారు. మెదక్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకా అనీ, అక్కడ టీఆర్ఎస్ కు కచ్చితంగా భారీ మెజారిటీ వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 సీట్లను గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. మెజారిటీ విషయంలో మెదక్, వరంగల్, కరీంనగర్ అగ్రస్థానాల్లో నిలుస్తాయని అంచనా వేశారు. అలాగే వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని కేటీఆర్‌ అన్నారు.

- Advertisement -