- Advertisement -
కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం అని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సీఎం పదవికి కావాల్సిన అన్ని అర్హతలు కేటీఆర్కు ఉన్నాయని చెప్పారు. సీఎం ఎవరనేది కేసీఆర్ నిర్ణయిస్తారని చెప్పారు.
కేటీఆర్ పార్టీని సమర్ధంగా నడిపిస్తున్నారని ఆయన నాయకత్వంలో అన్ని ఎన్నికల్లో విజయం సాధించామమని…రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కేటీఆర్ నాయకత్వంలో విజయం సాధించబోతున్నామని చెప్పారు. చంద్రబాబు తనయుడు లోకేష్,రాహుల్ గాంధీలు అసమర్ధులన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ దక్కదని అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురబోతుందన్నారు.
- Advertisement -