ఫిదా అయ్యానన్న కేటీఆర్‌

239
KTR fidaa
- Advertisement -

సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా చిత్రం కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తున్నది. సాయి పల్లవి, వరుణ్ తేజ్ నటించిన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ అనే టాక్‌ను సొంతం చేసుకొన్నది. జూలై 21న విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుంచి పాజిటివ్ రివ్యూలతో అందర్నీ ఆకర్షించింది. సాయి పల్లవి నటన ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. ఇప్పటికే సాధారణ ప్రేక్షకుడి నుండి ప్రముఖుల వరకు మన్ననలు అందుకున్న ఫిదాకు మంత్రి కేటీఆర్‌ కూడా ఫిదా అయిపోయారు.. ఫిదా సినిమాను పొగుడుతూ ట్వీట్ చేశారు. తెలంగాణ ప‌ల్లె జీవితాన్ని, యాస‌ను `ఫిదా` సినిమాలో చాలా బాగా చూపించార‌ని ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌ను కేటీఆర్ పొగిడారు. తెలంగాణ నేప‌థ్యంలో ఇంత చ‌క్క‌టి ప్రేమక‌థ‌ను చూపించినందుకు తాను ఫిదా అయ్యాన‌ని కేటీఆర్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.. వ‌రుణ్ తేజ్, సాయి ప‌ల్ల‌విలను ఈ ట్వీట్‌లో కేటీఆర్ ట్యాగ్ చేశారు.

‘ఫిదా’ సినిమాలో భానుమతి(సాయిపల్లవి) నటనను సీఎం కేసీఆర్‌ మెచ్చుకున్న సంగతి తెలిసిందే . నిజామాబాద్‌ జిల్లా సిర్నాపల్లి గ్రామంలోని పచ్చదనాన్ని అద్భుతంగా తెరకెక్కించడంతో కేసీఆర్‌ ఆద్యంతం చిత్రాన్ని ఢిల్లీ పర్యటనకు ముందే వీక్షించారు. తెలంగాణ యాసతో సాయిపల్లవి నటనకు కేసీఆర్‌ ‘ఫిదా’ అయ్యారు. దర్శకుడు శేఖర్‌ కమ్ముల, నిర్మాత దిల్‌రాజుతో ఫోన్‌లో మాట్లాడారు. సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారని, మిషన్‌ కాకతీయ వంటి పనులతో తెలంగాణ పచ్చదనంలో కోనసీమను తలదన్నేలా ఉందని గుర్తు చేశారు. చిత్ర యూనిట్ త‌న‌ను క‌ల‌వాల‌ని ఆహ్వానించారు. సినిమాలు చాలా తక్కువుగా చూసే సీఎం కేసీఆర్ ఇప్పుడు ఫిదా టీంని కలవమని చెప్పడమంటే గొప్పే..

- Advertisement -