తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రపంచ ఆర్థిక వేదిక నుంచి అరుదైన ఆహ్వానం అందుకున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనాలని ఆహ్వానించారు. చైనాలోని డాలియన్‌లో జూన్ 27 నుంచి 29 వరకూ డబ్ల్యూఈఎఫ్ సదస్సు జరుగుతుంది.
ఈ సమావేశాలకు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి సూమారు 2 వేల మంది ప్రతినిధులు హజరవుతారు. వివిధ దేశాలకు చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఐటి పరిశ్రమల శాఖ మంత్రులు సైతం హజరవుతారు. తనదైన విధానాలతో హైదరాబాద్ నగరాన్ని స్టార్ట్ అప్స్ క్యాపిటల్ గా మార్చినతీరు, మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్లతోపాటు బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ అందిచేందుకు చేస్తున్న ప్రయత్నాలపైన మాట్లాడాల్సిందిగా మంత్రిని వరల్డ్ ఎకానామిక్ ఫోరం కోరింది. తెలంగాణలో పెట్టుబడుల సేకరణకు సైతం ఈ సదస్సు ఉపయోగపడుతుందని వరల్డ్ ఎకానామిక్ ఫోరం తెలిపింది.ప్రపంచంలో నాల్గవ పారిశ్రామిక విప్లవానికి సహకరిస్తున్న పరిశోధకులు, పాలసీ మేకర్స్, వ్యాపారవేత్తలు హజరవుతారు.
ప్యూచర్ గ్లొబలైజేషన్- కెన్ ఇండియా లీడ్ అనే వార్షిక సెషన్ కు హజరవ్వాల్సిందిగా మంత్రి కేటీఆర్ కు సిఐఐ అహ్వనం పంపింది. డిమానిటైజేషన్, డిజిటలైజేషన్, మేక్ ఇన్ ఇండియా, జిఎస్టీ వంటి అర్ధిక వ్యవస్థను ప్రభావితం చేసే నిర్ణయాలు జరిగిన నేపథ్యంలో ఈ సమావేశం అర్ధిక వ్యవస్థకు దిశానిర్ధేశం చేసే దిశగా ఉంటుందని సిఐఐ లేఖలో పేర్కొంది. ఏప్రిల్ 28,29 న ఢిల్లీలో జరిగే ఈ సమావేశంలో ఉద్యోగాలు, టెక్నాలజీ అంశంపై ప్రసంగించాల్సిందిగా కోరింది.