ప్రజల కోసమే చివరిదాకా పోరాడిన కుటుంబం మాది కేటీఆర్‌

95
keshavarao
- Advertisement -

తెలంగాణ అంటే పోరాటాల గడ్డ, త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ. నాటి నిజాం వ్యతిరేక విధానాలను వ్యతిరేకించిన వారిలో మా అమ్మ వాళ్ల తండ్రి జే కేశవరావు ఉన్నారని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. మా తాతయ్య జే కేశవరావు భారత జాతిపిత గాంధీజీని స్పూర్తిగా తీసుకోని 1940వ దశాబ్దంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. కేశవరావు స్వాతంత్ర్య సమరయోధుడిగా భారత ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందారని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులపై మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న కేంద్రంలో ఉన్న మంత్రులు వాళ్ల పూర్వీకులు ఎంత మంది స్వాతంత్ర్య ఉద్యమంలో పాలుపంచుకన్నారని కేటీఆర్‌ ప్రశ్నించారు. వారికి సంబంధం లేని విషయాలను కూడా తమదని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారని కేటీఆర్‌ విమర్శించారు.

 

- Advertisement -