తెలంగాణ దేశానికే ధాన్య భాండగారంగా మారిందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. నగగరంలోని పల్లవి ఇన్‌స్టిట్యూట్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవీకి మద్దతుగా ఏర్పాటు చేసిన ప్రయివేటు కాలేజేస్ అండ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అండ్ స్టాఫ్ వేల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు కేటీఆర్.
రాష్ట్ర ప్రభుత్వం పన్నుల రూపంలో కేంద్రానికి రూ. 2 లక్షల 72 వేల కోట్లు కడితే.. కేంద్రం మాత్రం రాష్ర్టానికి చ్చింది రూ. లక్షా 40 వేల కోట్లు మాత్రమే అని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన అనతికాలంలోనే విద్యుత్ సమస్యను అధిగమించామని తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అంబేడ్కర్, జ్యోతిబాపులే, వివేకానంద ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పేరిట విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ అత్యంత సురక్షిత నగరంగా ఉందని….అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. పెట్టుబడులు వస్తున్నాయంటే సమర్థవంతమైన నాయకుడు, స్థిరమైన ప్రభుత్వం, శాంతి భద్రతలు పక్కాగా ఉన్నందుకే పెట్టుబడులు వస్తున్నాయన్నారు. తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లే దన్నారు. మోదీ ప్రభుత్వం ఏర్పడ్డ సమయంలో సిలిండర్ ధర రూ. 400 ఉంటే.. ఇప్పుడు దాని ధర రూ. 800లకు పెరిగిందన్నారు. మోదీ హయాంలో పెట్రోల్ ధర కూడా సెంచరీ కొట్టేసిందన్నారు. నల్లధనం తీసుకొస్తానని ఊదరగొట్టారు విదేశాల నుంచి ఇప్పటి వరకు కనీసం పైసా నల్లధనం తీసుకురాలేదు అని విమర్శించారు.