- Advertisement -
రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి శంకుస్ధాపన చేసిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం ఎత్తిపోథల పథకంలో భాగంగా కొనరావ్ పేట మండలంలోని మల్కపేటలో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను పరిశీలించారు. 9 ప్యాకేజ్ అండర్ టన్నెల్ పనులను అధికారులుతో కలిసి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
మల్కపేట వద్ద 3 టీఎంసీలు నీటి సామర్థ్యం గల జలశయాన్ని నిర్మిస్తున్నారు. ప్యాకేజీ–9 ద్వారా మల్కపేట రిజర్వాయర్, నిమ్మపల్లి మూలవాగు, సింగసముద్రం, ఎగువమానేరు, పెనంమడుగు జలాశయాలకు ఎత్తిపోతల ద్వారా సాగునీరు దరి చేరనుంది. వేములవాడ నియోజకవర్గంలోని 60వేల ఎకరాలకు, సిరిసిల్ల నియోజకవర్గంలోని 80వేల ఎకరాలకు గోదావరి జలాలు రానున్నాయి.
- Advertisement -