దుర్గం చెరువు పనులను పరిశీలించిన మంత్రి కేటీఆర్..

310
ktr
- Advertisement -

హైదరాబాద్ నగరంలో జరుగుతున్న పలు ప్రాజెక్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను తనిఖీ చేశారు. అనంతరం దుర్గం చెరువు పైన నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ పైన జరుగుతున్న పనులను పరిశీలించి అక్కడి కాంట్రాక్ట్ ఏజెన్సీలతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సస్పెన్షన్ బ్రిడ్జి కి సంబంధించిన పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయని ఈ సందర్భంగా ఎల్ అండ్ టీ ఇంజనీర్లు మంత్రికి తెలిపారు. సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత చేపట్టవలసిన సుందరీకరణ పనులు మరియు లైట్ నింగ్ వంటి అంశాల పై దృష్టిసారించాలని కోరారు.

సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత దానికి అనుసంధానంగా రోడ్ నెంబర్ 45 వరకు నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు మరింత వేగంగా కొనసాగించాలని అధికారులను కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించారు కేటీఆర్. ఇందుకు సంబంధించి ట్రాన్స్కో లైన్ల తరలింపు నూతన టవర్ల నిర్మాణం వంటి పెండింగ్ అంశాలపైన విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడారు.

రెండు వారాల్లోగా ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన మేరకు లైన్లను తరలిస్తామని మంత్రికి తెలిపిన ట్రాన్స్‌కో అధికారులు. ప్రస్తుతం జరుగుతున్న పనులను మరింత వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఐటీ కారిడార్ వైపు వెళ్లే వాహనాల రద్దీ, ట్రాఫిక్ జామ్ గణనీయంగా తగ్గుతుందన్నారు.

- Advertisement -