- Advertisement -
రాష్ట్ర ప్రభుత్వం గేమింగ్,మల్టీమీడియా ఇండస్ట్రీలపై ప్రత్యేక దృష్టిసారించిందని ఐటీ శాఖమంత్రి కేటీఆర్ తెలిపారు. హెచ్ఐసీసీలో నాస్కామ్ ఆధ్వర్యంలో గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ ను ఆయన ప్రారంభించారు.గేమింగ్ ఇండస్ట్రీలో మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఇమేజ్ టవర్ ఫస్ట్ లుక్ ను ఆయన విడుదల చేశారు. హైదరాబాద్ లో వందకుపైగా పేరున్న గేమింగ్ సంస్థలున్నాయన్నారు.
బాహుబలి,మగధీర, ఈగ, లైఫ్ ఆఫ్ పై వంటి పెద్ద సినిమాల విజువల్ ఎఫెక్ట్స్,గ్రాఫిక్స్ అన్ని హైదరాబాద్‌లోనే జరిగాయని తెలిపారు. హైదరాబాద్ లో 30వేల మంది గేమింగ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ టెక్నాలజీ పేరుతో నగరంలో భారీ ఇంక్యుబేటర్ నిర్మిస్తమని స్పష్టం చేశారు. తెలంగాణ టెక్నాలజీ పేరుతో నగరంలో భారీ ఇంక్యుబేటర్ నిర్మిస్తమని స్పష్టం చేశారు.
- Advertisement -