- Advertisement -
ఈ రోజు సికింద్రాబాద్‌లో నూతనంగా నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘ్ డివిజనల్ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రైల్వే ఉద్యోగులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, ఈరోజు ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఖమ్మం కార్పొరేషన్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు.
- Advertisement -