తెలంగాణ కళారూపాలకు నిలయం…

217
KTR inaugurate Telangana Kala Mela
- Advertisement -

అనేక కళారూపాలకు తెలంగాణ కళా నిలయమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన తెలంగాణ కళామేళాను కేటీఆర్‌ ప్రారంభించారు. కళాకారులను ప్రొత్సహించాల్సిన అవసరం ఉందన్న ఆయన.. ఇలాంటి ప్రదర్శనల ద్వారా భాగ్య నగరం స్వరూపాన్ని కళాకారులు మార్చేస్తున్నారని చెప్పారు. ప్రతీ కళాకారుడిని వెలుగులోకి తీసుకురావాలన్న కేటీఆర్‌.. ప్రభుత్వం కళలను ప్రొత్సహిస్తుందన్నారు.

హైదరాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రభుత్వ ఆస్తులను రక్షించడంతో పాటు వాటిపై వాల్ రైటింగ్స్ రాయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో ఎక్కడ పడితే అక్కడ వాల్ రైటింగ్స్ రాసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కేసులు నమోదు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. టీఆర్‌ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై కూడా చర్యలకు వెనుకాడొద్దన్నారు. అప్పుడే అందరికీ ఆదర్శంగా నిలుస్తామన్నారు. రాబోయే కాలంలో హైదరాబాద్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -