సీఎం కేసీఆర్ యువ పారిశ్రామికవేత్తల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ హిమాయత్ నగర్‌లో మహిళా పారిశ్రామిక వేత్త గౌతమి ఏర్పాటచేసిన పిజ్జా అవుట్ లెట్‌ను ప్రారంభించిన కేటీఆర్ గిరిజన యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రిన్యువర్ షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కింను తీసుకొచ్చారని చెప్పారు.
గతంలో తానే స్వయంగా వచ్చి షాప్‌ను ఓపెన్ చేస్తానని మాట ఇచ్చానని అందులో భాగంగా ఇవాళ ఓపెన్ చేసినట్లు వెల్లడించారు. ప్రతి గిరిజన బిడ్డ ఇలాంటి సెంటర్లను ఏర్పాటు చేసి ఇతరులకి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.
సీఎం కేసీఆర్ గిరిజన బిడ్డలకు హైదరాబాద్ లో పారిశ్రామిక వేత్తలు ప్రోత్సాహకాలు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్. హైదరాబాద్ లో పిజ్జా సెంటర్ ,హోటల్ లలో జీతాలు ఉండే గిరిజన బిడ్డలు సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో వారే ఇవాళ చాలా మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు.
Minister ktr inagurates pizza shop at himayathnagar…..ktr inagurates pizza shop at himayathnagar